Disha Pathani: ఫొటోగ్రాఫర్ పై దిశా పటానీ బాడీగార్డ్ అనుచిత వైఖరి...: వీడియో ఇదిగో!

Disha patani Bodyguard Throws a Photo grapher
  • దిశ కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్
  • ఫొటో తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని తోసేసిన బాడీగార్డ్
  • దిశ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కుతబ్
సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా. ఈ క్రమంలో కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా మిగులుతూ ఉంటాయి. తాజాగా ఈ జాబితాలో నటి దిశా పటానీ కూడా చేరిపోయింది. ఆమె బాడీగార్డ్ ఓ ఫొటోగ్రాఫర్ తో వాగ్వాదానికి దిగి తోసేయడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఇటీవల దిశా పటానీ కనిపించగానే, పలువురు ఫ్యాన్స్, ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. వారిలో 'పాప్ భయానీ' ఫొటోగ్రాఫర్ కుతబ్ కూడా ఉన్నారు. ఆమెను తన కెమెరాలో బంధించేందుకు కుతబ్ ప్రయత్నించగా, బాడీగార్డ్ అడ్డుకున్నాడు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన బాడీగార్డ్ కుతబ్ ను నెట్టివేశాడు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాధితుడు, దిశా పటానీ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. కాగా, ప్రస్తుతం దిశ, ప్రభుదేవా డైరెక్షన్ లో 'రాధే ' చిత్రంలో సల్మాన్ పక్కన జతకట్టిన సంగతి తెలిసిందే.
Disha Pathani
Photographer
Bodyguard

More Telugu News