Vijay Devarakonda: 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ కు కారణం విజయ్ దేవరకొండేనట... దర్శకుని అసంతృప్తి!

Movie Flop Reason Vijay Devarakonda
  • రెండు వారాల క్రితం విడుదలైన సినిమా
  • వసూళ్ల పరంగా నిరాశ పరిచిన చిత్రం
  • అనవసరంగా విజయ్ కల్పించుకున్నాడంటున్న క్రాంతి మాధవ్
రెండు వారాల క్రితం విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం పరాజయం వెనుక హీరో విజయ్ దేవరకొండ అతిగా కల్పించుకోవడమే కారణమని, సినిమా షూటింగ్ మొదలయ్యాక కథలో కల్పించుకోవడంతో పాటు ఎన్నో సన్నివేశాలను రీషూట్ చేయించాడని, ఫలితంగానే తాను అనుకున్న స్క్రిప్ట్ తప్పిందని దర్శకుడు క్రాంతి మాధవ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట. వాస్తవానికి ఈ సినిమాకు ముందు హీరో విజయ్ దేవరకొండ జోష్ మీదుంటే, దర్శకుడు క్రాంతి మాధవ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

తన తొలి రెండు చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న క్రాంతి మాధవ్, మూడో చిత్రం 'ఉంగరాల రాంబాబు'తో నిరాశ చెందాడు. ఇక ఇదే సమయంలో విజయ్ దేవరకొండ అతనితో కలవడంతో కెరీర్ గాడిలో పడుతుందని అందరూ భావించారు. అయితే, చాలా పకడ్బందీగా తాను తయారు చేసుకున్న స్క్రిప్ట్ ను విజయ్ చెడగొట్టాడని అందుకే సినిమా ఫ్లాప్ అయి, తనకు చెడ్డపేరు తెచ్చిందని క్రాంతి మాధవే అంటున్నాడని సినీ వర్గాల సమాచారం.

హిట్ మీద హిట్ తో ఉన్న జోరుమీదున్న విజయ్, ప్రతి సన్నివేశంలో కల్పించుకున్నాడని, తనకు అనుకూలంగా మార్చుకున్నాడని, దర్శకుడిగా తనకు స్వేచ్ఛ లేకుండా చేసినందువల్లే సినిమా ఫలితం ఇలా వచ్చిందని బావురుమంటూ ఉన్నాడట. సినిమా ప్రమోషన్స్ సమయంలో తన మనసులోని మాటను బయటపెట్టని క్రాంతి మాధవ్, సినిమా ఫ్లాప్ అయిన తరువాత విజయ్ ముందే తన అసంతృప్తిని వెళ్లగక్కాడట. అనవసరంగా వేలు పెడితే ఫలితం ఇలాగే ఉంటుందని క్లాస్ పీకాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Vijay Devarakonda
World Famous Lover
Kranthi Madhav
Flop

More Telugu News