New Delhi: 'ఒకే గోత్రం ఉన్న అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్?' అంటూ కూతురి గొంతు కోసి చంపారు!

parents killed their daughter
  • మూడేళ్లు సహజీవనం చేసిన యువతీయువకులు
  • అనంతరం పెళ్లి చేసుకుని ఇంటికి
  • కూతురిని చంపి కాలువలో పడేసిన తల్లిదండ్రులు
ఒకే గోత్రం ఉన్న అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అంటూ కూతురి గొంతు కోసి చంపారు తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. తమ ఇంటి పక్కన ఉండే అబ్బాయి అంకిత్‌ను శ్రీతల్ చౌదరి అనే అమ్మాయి ప్రేమించింది. గోత్రం ఒకటే కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు పారిపోయి, మూడేళ్లు సహజీవనం చేశారు. కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకుని ఎవరింటికి వారు వెళ్లిపోయి తమ కుటుంబ సభ్యులకు పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

దీంతో కూతురు గొంతు కోసి ఆమె తల్లిదండ్రులు చంపేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో వేసుకుని యూపీలోని ఓ కాలువలో పడేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చి ఎప్పటిలాగే తమకేం తెలియదన్నట్లు ఉంటున్నారు. తన భార్య తనకు కనపడకపోవడంతో అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తల్లిదండ్రులే ఆ అమ్మాయిని చంపినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. తాము చేసిన హత్యను తల్లిదండ్రులు అంగీకరించారు.
New Delhi
Crime News

More Telugu News