Samantha: స్నేహ భర్తకు జోడీగా సమంత

  • సమంతను నిరాశపరిచిన 'జాను'
  • 'మాయ' దర్శకుడితో సమంత
  • త్వరలోనే షూటింగ్ మొదలు  
Ashwin Sharavanan Movie

తెలుగులో ఇటీవల సమంత చేసిన 'జాను' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత ఆమె తెలుగులో చేసే సినిమాలకి సంబంధించిన సమాచారం తెలియాల్సి వుంది. తమిళంలో మాత్రం ఆమె రెండు సినిమాలను అంగీకరించినట్టుగా తెలుస్తోంది.  ఒక సినిమాలో ఆమె నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక మరో సినిమాలో ఆమె హీరో ప్రసన్న జోడీగా కనిపించనుంది.  ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో తమిళంలో నయనతార ప్రధాన పాత్రధారిగా అయన రూపొందించిన 'మాయ' అక్కడ ఘన  విజయాన్ని సాధించింది. అదే సినిమా తెలుగులో 'మయూరి'గా విజయవంతమైంది. ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో సమంత చేయనుంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News