అయోధ్యలో ప్రత్యామ్నాయ భూమికి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకారం
- ఐదు ఎకరాలను ఎలా వినియోగించుకోవాలో సోమవారం నిర్ణయం
- మసీదు నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటు చేయనున్న బోర్డు
- దానికి ‘ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్’ పేరు పెట్టే అవకాశం
మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిని ఎలా వినియోగించుకోవాలో ఈ నెల 24న జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. ఈ విషయంలో వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థలంలో పాఠశాల కట్టాలని కొందరు చెబుతుంటే.. ఆసుపత్రి నిర్మించాలని మరికొందరు సూచిస్తున్నారు. దీనిపై సోమవారం జరిగే భేటీలో స్పష్టత రానుంది. అలాగే, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డు ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి ‘ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్’ అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.