ట్రంప్ పర్యటనపై రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్!

22-02-2020 Sat 12:22
  • భారత పర్యటనకు విచ్చేస్తున్న ట్రంప్
  • మిలియన్ల మంది తనను ఆహ్వానిస్తారన్న అమెరికా అధ్యక్షుడు
  • దానికి ఒకటే దారి ఉందన్న వర్మ
Ram Gopal Varma tweets on Donald Trump India visit

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్ లో తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైరిక్ గా ట్వీట్ చేశారు.

'ఇండియాలో ట్రంప్ ను 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారి ఉంది. ట్రంప్ పక్కన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమే' అంటూ వర్మ చమత్కరించారు. వర్మ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేఏ పాల్, మెగాస్టార్, పవన్ కల్యాణ్ లను మర్చిపోయారంటూ కొందరు రీట్వీట్ చేశారు.