Sajjala Ramakrishna Reddy: వైఎస్ జగన్, చంద్రబాబునాయుడుల మధ్య తేడా ఇది!: సజ్జల రామకృష్ణారెడ్డి

Ysrcp leader Sajjala talk about Veligonda project
  • ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు గురించి ప్రస్తావన
  • బాబు హయాంలో మొదటి టన్నెల్ లో తవ్వింది 600 మీటర్లే
  • సీఎం జగన్ వచ్చాక ’వెలిగొండ‘లో 1.4 కిలోమీటర్లు తవ్వారు
ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ గురించి ప్రస్తావిస్తూ.. వైఎస్ జగన్, చంద్రబాబునాయుడుల ‘మధ్య తేడా ఇది’ అంటూ బాబును విమర్శిస్తూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు హయాంలో ‘వెలిగొండ’ మొదటి టన్నెల్ లో తవ్వింది 600 మీటర్లేనని, సీఎం జగన్ ఎనిమిది నెలల పాలనలో 1.4 కి.మీ. తవ్వారని అన్నారు. ఈ ఆగస్టు నాటికి ఫేజ్–1 ద్వారా ఆయకట్టుకు నీళ్లు వస్తాయని జగన్ చెప్పడం ప్రకాశం జిల్లా రైతులకు ఊరటనిస్తుందని చెప్పారు.
Sajjala Ramakrishna Reddy
Veligonda project
Jagan
YSRCP
cm

More Telugu News