Nirbhaya: దోషికి కాదు.. లాయర్​కే విశ్రాంతి కావాలి: నిర్భయ తల్లి ఆశాదేవి

  • నిర్భయ నిందితుల తరఫు లాయర్ పై ఆశాదేవి ఆగ్రహం
  • కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
Nirbhayas Mother says Lawyer Needs Rest

నిర్భయ నిందితుల తరఫున వాదిస్తున్న లాయర్ ఏపీ సింగ్ పై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల ఆరోగ్యం బాగా లేదని కోర్టును తప్పుదోవ పట్టిస్తూ.. న్యాయం ఆలస్యమయ్యేలా చేస్తున్నారని ఆరోపించింది. ఈ కేసులో నలుగురు నిందితులకు పటియాల హైకోర్టు సోమవారం తాజా డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే, దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ నిరాహార దీక్ష చేస్తున్నాడని, అతని మతిస్థిమితం సరిగ్గా లేదని లాయర్ ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు.

అలాగే, నిందితులకు అన్ని పరీక్షలు చేసి వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. దీనిపై ఆశాదేవి అసహనం వ్యక్తం చేసింది. ‘నిందితుల తరఫు లాయర్ ఏపీ సింగ్ వద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే కోర్టును తప్పుదోవ పట్టిస్తూ న్యాయం ఆలస్యమయ్యేలా చేస్తున్నారు. వినయ్ సింగ్‌కు కాదు, ఆ లాయర్ కే విశ్రాంతి కావాలి. వినయ్ బాగానే ఉన్నాడు. అతని మానసిక స్థితి కూడా సరిగ్గానే ఉంది’ అని ఆశాదేవి చెప్పుకొచ్చారు.

More Telugu News