Bihar: బీహార్‌లో 'ఉమ్మడి వేదిక' కోసం పావులు కదుపుతున్న ప్రశాంత్ కిశోర్

  • ముఖ్యమంత్రి నితీష్ కు వ్యతిరేకంగా ఆరంభమైన ప్రణాళిక 
  • మహాగట్ బంధలోని రెండు పక్షాలతో భేటీ 
  • ఇప్పటికే 'బాత్ కీ బీహార్' క్యాంపైన్ ప్రారంభం
PK on the route way to create new force in Bihar

సరికొత్త బీహార్ ను ఆవిష్కరించడమే తన లక్ష్యమని చెబుతున్న ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్ కిశోర్ (పీకే) అందుకు అనుగుణంగా పావులు కదపడం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ పక్షాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా తొలుత 'మహాఘట్ బంధన్'లోని హిందుస్థాన్ అవామ్ మోర్చా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జితిరాం మాఝీని కలిశారు. అలాగే, ఆర్ఎస్ఎల్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహాను కలిశారు. మహాఘట్ బంధన్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూడా భాగస్వాములే. కానీ ఆర్జేడీతో భేటీకి పీకే ఆసక్తి చూపడం లేదు.

నిన్న 'బాత్ కీ బీహార్' క్యాంపైన్ ప్రారంభించిన పీకే సభ్యత్వ నమోదు కూడా మొదలు పెట్టారు. ఇందులో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ భేటీకి ముందు పీకే మాట్లాడుతూ తానేమీ ప్రత్యేక రాజకీయ పార్టీని స్థాపించడం లేదని, కానీ ఓ ఉమ్మడి రాజకీయ వేదికను సృష్టించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓ యూత్ ఆర్మీని సృష్టించే పనిలో పీకే ఉన్నారని, ఎన్నికల నాటికి ఓ ప్రత్యామ్నాయ వేదిక సృష్టిస్తారని తేలిపోయిందని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అక్టోబర్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  

More Telugu News