Nannapaneni: రోజా కార్లో కూర్చుని సెల్ ఫోన్ లో ప్రభుత్వానికి తెలియజేయడమేంటి?: నన్నపనేని

Nannapaneni take a dig at Roja
  • రోజాను అడ్డుకున్న రైతులు
  • రోజాను రైతులు జై అమరావతి అనాలని కోరారన్న నన్నపనేని
  • రైతులను రెచ్చగొట్టేందుకు వచ్చారని ఆరోపణ
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు. నేలపాడు ఎస్ఆర్ఎం వర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళుతున్న రోజాను పెదపరిమి వద్ద రాజధాని రైతులు అడ్డగించగా, ఆమె చాలాసేపు కార్లోనే కూర్చుండిపోవాల్సి వచ్చింది.

దీనిపై నన్నపనేని స్పందిస్తూ, రైతులు రోజాను జై అమరావతి అనాలని కోరారని, దీనికి రోజా కార్లో కూర్చునే సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం ఏంటి? ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటి? అని మండిపడ్డారు. అసలు, రోజా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టేందుకు ఆమె వచ్చారని ఆరోపించారు. జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోందని విమర్శించారు. ఇక్కడి భూములు సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయని, ఎవరికీ పంచడానికి లేదని నన్నపనేని స్పష్టం చేశారు.
Nannapaneni
Roja
Amaravati
Farmers
Police
Telugudesam
YSRCP

More Telugu News