తల్లితో కలిసి ప్రాణాలు విడిచిన జర్మనీ కాల్పుల నిందితుడు

20-02-2020 Thu 14:23
  • జర్మనీ, హనావ్ నగరంలో కాల్పుల మోత ..9 మంది మృతి
  • కాల్పులు జరిపిన వ్యక్తిని టోబీ ఆర్ గా గుర్తించిన పోలీసులు
  • ఓ అపార్ట్ మెంట్ లో రెండు మృతదేహాల గుర్తింపు
  • వాటిలో ఒకటి టోబీ ఆర్ ది గా భావిస్తున్న పోలీసులు
Germany shooting attacker died alongside with his mother
జర్మనీలోని హనావ్ నగరంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 9 మందిన పొట్టనబెట్టుకున్న దుండగుడు తన అపార్ట్ మెంట్ లోనే విగతజీవిలా కనిపించాడు. హనావ్ లోని రెండు స్మోకింగ్ బార్లపై కాల్పులు జరిపిన టోబీ ఆర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు జరిపారు.

ఈ నేపథ్యంలో, ఓ అపార్ట్ మెంట్ లో రెండు మృతదేహాలను గుర్తించారు. వాటిలో ఒకటి టోబీ ఆర్ ది కాగా, మరొకటి అతని తల్లిదని భావిస్తున్నారు. సంఘటన స్థలంలో పోలీసులు ఓ లేఖ, వీడియో స్వాధీనం చేసుకున్నారు. జర్మనీలో నివసిస్తున్న కొందరిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని టోబీ ఆర్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అతివాద భావజాలంతో ప్రేరేపితుడైన టోబీ ఆర్ జర్మనీలో ఉంటున్న టర్కిష్, కుర్దిష్ శరణార్థులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని భావిస్తున్నారు.