చూడటానికి రానా అలా కనిపిస్తాడంతే: హీరోయిన్ సీరత్ కపూర్
- ఇతర భాషా చిత్రాలతోను రానా బిజీ
- అందరితో కలుగోలుగా వుండే రానా
- తనకి మంచి స్నేహితుడన్న సీరత్ కపూర్
రానాను దగ్గరగా చూసినవాళ్లు ఆయన వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ మాట్లాడకుండా ఉండలేరు. తాజాగా ఆ జాబితాలో హీరోయిన్ సీరత్ కపూర్ కూడా చేరిపోయింది. "రానాతో నాకు చాలా కాలం నుంచి పరిచయం వుంది .. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం వుంది. చూడటానికి రానా చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తాడుగానీ, ఆయన మనసు చాలా సున్నితం. రానా ఎక్కడ వుంటే అక్కడ సందడి ఉండటానికి కారణం ఆయన మంచి మనసే" అని చెప్పుకొచ్చింది. ఆమె తాజా చిత్రమైన 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాను రానా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.