Prabhas: మరోసారి మాస్ హీరోగా కనిపించనున్న ప్రభాస్

Prabhas Movie
  • మాస్ హీరోగా ప్రభాస్ కి క్రేజ్ 
  • పూర్తి రఫ్ లుక్ తో కనిపించనున్న ప్రభాస్ 
  • త్వరలోనే రానున్న స్పష్టత
ప్రభాస్ లుక్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఆయనను మాస్ ఆడియన్స్ కి చేరువ చేశాయి. 'ఛత్రపతి' వంటి సినిమాలు ఆయన మాస్ ఇమేజ్ ను మరింతగా పెంచాయి. అయితే ఆ తరువాత కాలంలో ఆయన చేసిన సినిమాలు మాస్ టచ్ ఉంటూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తూ సాగాయి.

ఈ మధ్య కాలంలో ఆయన పూర్తి మాస్ హీరోగా కనిపించలేదు. అలాంటి సమయం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వాళ్ల కోరిక నెరవేరనున్నట్టు తెలుస్తోంది. పక్కా లోకల్ .. అంటూ కాలర్ ఎగరేసుకు తిరిగే యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని అంటున్నారు. పూర్తి రఫ్ లుక్ తో మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా రూపొందనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సందీప్ రెడ్డి వంగానా? వేరెవరైనానా? అనేది త్వరలోనే తెలియనుంది.
Prabhas
Sandeep Reddy Vanga
Tollywood

More Telugu News