Ajit: అజిత్ షూటింగులో ప్రమాదం... స్వల్ప గాయాలు!

  • 'వలిమై' షూటింగ్ లో ప్రమాదం
  • బైక్ చేజింగ్ సీన్ లో స్కిడ్ అయిన బైక్
  • కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
Accident in the Shooting set of Ajit Valimai

శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'భారతీయుడు-2' షూటింగ్ లో ఘోర ప్రమాదం సంఘటన అందర్నీ కలవరపెడుతున్న సమయంలోనే, కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌రైన అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వలిమై' షూటింగ్‌ లో కూడా ప్రమాదం జరిగిందన్న వార్త వినిపిస్తోంది. ఈ ఘటనలో అజిత్ కు స్వల్ప గాయాలయ్యాయి.

'ఖాకి' ద‌ర్శ‌కుడు హెచ్‌ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బైక్ ఛేజింగ్ సీన్‌ ను చిత్రీక‌రిస్తున్న‌ వేళ, బైక్ స్కిడ్ కావడంతో అజిత్‌ కు స్వల్పంగా దెబ్బ‌లు త‌గిలాయ‌ని తెలుస్తోంది. ఆపై, కాసేపు విశ్రాంతి తీసుకున్న అజిత్, ఆ షాట్ ను పూర్తి చేసిన తరువాత ఆసుపత్రికి వెళ్లగా, కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైద‌రాబాద్‌ లో జరుగనుంది. ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తుండటంతో పలు ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు.

More Telugu News