PG ECET: తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల

  • ఎంటెక్, ఎంఫార్మ్ ప్రవేశాల కోసం పరీక్షలు
  • మార్చి 3న నోటిఫికేషన్
  • మే 28 నుంచి 31 వరకు పరీక్షలు
  • జూన్ 15న ఫలితాలు
తెలంగాణలో పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఎంటెక్, ఎంఫార్మ్ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. ఆన్ లైన్ విధానం ద్వారా మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జరిమానాతో మే 26 వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. మే 20 నుంచి మే 27 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పీజీ ఈసెట్ లో భాగంగా మే 28 నుంచి మే 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 15న ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
PG ECET
Telangana
Schedule
Notification

More Telugu News