Asaduddin Owaisi: ఏపీ సీఎం జగన్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వినతి

asaduddin request to jagan
  • సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై అసదుద్దీన్ ఆందోళన
  • నిన్న విజయవాడలో ఎన్పీఆర్, ఎన్సార్నీలకు వ్యతిరేకంగా సభ
  • ఎన్పీఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్‌ను కోరుతున్నాం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిన్న రాత్రి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు వందలాది మంది తరలివచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటో పోస్ట్ చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు.

'నిన్న విజయవాడలో ఎన్పీఆర్, ఎన్సార్నీలకు వ్యతిరేకంగా సభ నిర్వహించాం. ఎన్పీఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్‌ను కోరుతున్నాం' అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. కాగా, పౌరసత్వం నిరూపించుకోలేని భారతీయులను నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ఆయన నిన్నటి సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
Asaduddin Owaisi
MIM
Hyderabad
Vijayawada
Andhra Pradesh

More Telugu News