Hyderabad: 'రేపటిలోగా పౌరసత్వాన్ని నిరూపించుకోండి'.. 127 మంది హైదరాబాదీలకు షాక్‌ ఇస్తూ నోటీసులు జారీ!

prove your citizenship
  • ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలి
  • నిరూపించుకోకపోతే ఆధార్‌ కార్డులను రద్దు చేస్తాం
  • లేదంటే చట్టబద్ధంగానే ప్రవేశించామన్న విషయాన్ని నిరూపించుకోవాలి
పౌరసత్వం నిరూపించుకోవాలంటూ 127 మంది హైదరాబాదీలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) షాక్‌ ఇచ్చింది. ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం భారత పౌరులమని నిరూపించుకోకపోతే ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని తెలిపింది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సత్తర్‌ ఖాన్‌ అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్‌ కార్డు అందుకున్నారన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్‌ ఈ నెల 3న అతనికి నోటీసులు జారీ చేసింది.

పౌరసత్వం లేకపోతే, భారత్‌లోకి  చట్టబద్ధంగానే ప్రవేశించామన్న విషయాన్ని నిరూపించుకోవాలని చెప్పింది. దీంతో అతడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తన ఆవేదనను తెలిపాడు.  తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందారంటూ తమకు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే నోటీసులు పంపామని అధికారులు చెప్పారు.
Hyderabad
adhar
India

More Telugu News