Prabhas: 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 'డెవిల్'?

Sandeep Reddy Vanga Movie
  • తెలుగులో హిట్ కొట్టిన 'అర్జున్ రెడ్డి'
  • 'కబీర్ సింగ్' టైటిల్ తో హిందీలోను విజయవంతం 
  • ఆసక్తిని చూపని రణ్ బీర్ కపూర్  
తెలుగులో కొంతకాలం క్రితం వచ్చిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాప్యులర్ అయ్యాడు. దాంతో బాలీవుడ్ నుంచి ఆయనకి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 'అర్జున్ రెడ్డి' సినిమాను అక్కడ 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసిన ఆయన, మరోసారి ఘన విజయాన్ని అందుకున్నాడు.

ఆ తరువాత అక్కడే ఆయన రణ్ బీర్ కపూర్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి 'డెవిల్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన రణ్ బీర్ కపూర్ ఈ ప్రాజెక్టు పట్ల అంతగా ఆసక్తిని చూపలేదట. దాంతో సందీప్ రెడ్డి ఈ కథను ప్రభాస్ కి వినిపించగా, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి వుంది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమా షూటింగులో బిజీగా వున్నాడు.
Prabhas
Sandeep Reddy Vanga Movie
Ranbir Kapoor

More Telugu News