Ratan TAta: ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది: రతన్ టాటా

Ratan Tata posts video on sewerage employees
  • ముంబయి పారిశుద్ధ్య కార్మికులపై వీడియో
  • 'మిషన్‌ గరిమ' ద్వారా సాయపడుతున్నామన్న రతన్ టాటా
  • వారి శ్రమను గుర్తించాలన్న కేటీఆర్
ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది అంటూ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పారిశుద్ధ్య కార్మికుల వెతలను, వారు చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ, ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నిమిషాల్లో వైరల్ అయింది. ఓ విద్యార్థి తన పాఠశాలలో చెప్పిన కవితకు సంబంధించిన వీడియో ఇది. పారిశుద్ధ్య కార్మికులు క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారని, వారిపై భారం తగ్గించేందుకు తాము కూడా కృషి చేస్తున్నామని వ్యాఖ్యానిస్తూ రతన్ టాటా ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ముంబయిలో నిత్యమూ 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులను నిర్వహిస్తున్నారని, 'మిషన్‌ గరిమ' ద్వారా కష్టపడి పనిచేసే వారిపై భారం తగ్గించడం, సురక్షిత, పరిశుభ్రమైన, మానవీయ వాతావరణాన్ని కల్పించడానికి 'టూబిన్స్‌ లైఫ్‌ విన్స్‌' నినాదంతో తమ టాటా ట్రస్టు కృషి చేస్తోందని రతన్ టాటా వ్యాఖ్యానించారు.

ఇక ఈ వీడియో వైరల్ కాగా, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యతని, వ్యర్థాలను వేరు చేస్తున్న కార్మికులకు సాయం చేద్దామని, తడి, పొడి చెత్తను వేరు చేయాలని అన్నారు. వారి శ్రమ గౌరవాన్ని గుర్తించాలని, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా తమ ట్విట్టర్‌లో ఉంచిన వీడియోను అందరూ తిలకించాలని కోరారు.
Ratan TAta
KTR
Sewerege
Mumbai
Viral Videos

More Telugu News