హామీ ఇచ్చిన ప్రభుత్వమే రైతులను నిలువునా మోసం చేసింది: పవన్ కల్యాణ్ విమర్శలు
- రైతులు ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నాయి
- ధాన్యం అమ్మిన రైతులకు రూ.2016 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది
- రైతులకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి?
‘రైతు సంక్షేమం, భరోసా‘ అంటూ నాడు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని దుయ్యబట్టారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.2016 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉందని, లక్ష మంది రైతులు తమకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని, రెండో పంట పెట్టుబడికి చేతిలో డబ్బు లేక ఇబ్బందిపడుతున్నారని అన్నారు. రైతులకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.