Cricket: ఇండియా, పాకిస్థాన్​ ఉల్లి, ఆలుగడ్డలు ఎగుమతి చేసుకోవచ్చుగానీ.. క్రికెట్​ ఆడకూడదా?: పాక్​ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​

India Pakistan Can Trade Aloo Pyaaz Why Not Play Cricket Shoaib Akhtar said
  • ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించాలి
  • అవసరమైతే తటస్థ వేదికలపై ఆడాలి
  • మిగతా స్పోర్ట్స్ లో లేనిది క్రికెట్ లో ఎందుకని ప్రశ్న

ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లను ఆపేయడం సరికాదని.. అన్ని ఆటల్లో లేనిది క్రికెట్ లో ఎందుకు ఉండాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఉల్లిపాయలు, ఆలుగడ్డల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు జరగడం క్రికెట్ కు మంచిదని వ్యాఖ్యానించారు.

పోనీ, వేరే చోట ఆడొచ్చు కదా..

ఇండియా ప్లేయర్లు పాకిస్థాన్ కు, పాకిస్థాన్ ప్లేయర్లు ఇండియాకు వచ్చే పరిస్థితి లేదని.. అయితే విదేశాల్లోని తటస్థ వేదికలపై మ్యాచ్ లు నిర్వహించవచ్చు కదా అని షోయబ్ అక్తర్ అన్నారు. తాము సచిన్ ను, గంగూలీని, సెహ్వాగ్ ను ఎంతగానో ఇష్టపడతామన్నారు. ఇరు దేశాల మధ్య విభేదాలు క్రికెట్ పై ప్రభావం చూపకూడదన్నది తన అభిప్రాయమని చెప్పారు. త్వరలోనే ఇండియా–పాక్ మ్యాచ్ లు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు.

మరికొందరు క్రికెటర్లు కూడా..

ఇటీవలే వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, షాషిద్ అఫ్రీదీ కూడా ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారు. ఇండియా–పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు మొత్తంగా క్రికెట్ కు మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఇండియా–పాక్ టీమ్ ల మధ్య చివరిసారిగా 2008లో ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్, 2013లో దైపాక్షిక వన్డే సిరీస్ లు జరిగాయి. ఆ తర్వాత కేవలం అంతర్జాతీయ టోర్నీల్లో ఎదురుపడినప్పుడు మాత్రమే ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News