Vijayawada: వైద్యుల నిర్లక్ష్యంపై బాధితుల ధ్వజం: గన్నవరం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

  • పోలవరం కాలువలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరుల మృతి
  • పోస్టుమార్టం చేయకుండా జాప్యం చేశారని వైద్యులపై ఆరోపణ
  • ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగిన బాధితులు

తాము అత్యంత విషాదంలో ఉన్న సమయంలో సాయపడి ఓదార్పు ఇవ్వాల్సిన ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమను క్షోభ పెట్టారని ఆరోపిస్తూ పలువురు బాధితులు ఈరోజు గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే...నిన్న పోలవరం కాలువలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. వీరి మృతదేహాలను వెలికితీసి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగిస్తారని బాధిత కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. కానీ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తమ వారి మృతదేహాలను అప్పగించాలంటూ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగడంతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

More Telugu News