B.Gopal: అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను తీసుకున్న జీతం నెలకి 100 రూపాయలు: దర్శకుడు బి.గోపాల్

  • కాలేజ్ రోజుల్లోనే నాటకాలపై ఆసక్తి ఎక్కువ 
  • పీసీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ గా చేరాను 
  • 'అడివిరాముడు'తో రాఘవేంద్రరావు ఛాన్స్ ఇచ్చారన్న బి. గోపాల్  
Adavi Ramudu Movie

తెలుగు తెరపై యాక్షన్ కథలను పరిగెత్తించిన దర్శకుల జాబితాలో బి.గోపాల్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "నేను ఒంగోలు కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. అందువలన చదువు ఎక్కడం లేదనే విషయం నాకు అర్థమై పోయింది.

దాంతో సినిమాల పట్ల నాకు గల ఇంట్రెస్ట్ ను మా నాన్నకి చెప్పాను. ఆయన అంగీకరించి చెన్నైలోని తన స్నేహితుడి దగ్గరికి పంపించారు. ఆయన నన్ను దర్శకుడు పీసీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చారు. పీసీ రెడ్డిగారు నాకు నెలకి 100 రూపాయల జీతం ఇచ్చేవారు. ఒక ఏడాది పనిచేస్తే మరో ఏడాది ఖాళీగా ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లోనే రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. 'అడివి రాముడు' సినిమా కోసం ఆయన నన్ను తీసుకున్నారు. అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకూ నేను ఖాళీగా వున్నది లేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News