Stock Market: ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు

  • ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 609 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
markets ends in losses

గత ఆరు సెషన్లుగా లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609 పాయింట్లు నష్టపోయి 73,730కి పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 22,419కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (7.34%), విప్రో (0.79%), ఐటీసీ (0.56%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.53%), టైటాన్ (0.33%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-7.73%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.36%), నెస్లే ఇండియా (-3.08%), కోటక్ బ్యాంక్ (-2.11%).  

More Telugu News