Telugudesam: తెలుగుదేశం ఎమ్మెల్సీల హస్తిన పర్యటన రద్దు!

TDP MlCs Delhi Tour Cancel
  • మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని భావించిన ఎమ్మెల్సీలు
  • ఖరారు కాని కేంద్ర పెద్దల అపాయింట్ మెంట్లు
  • 19 నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాలు, మండలి రద్దు, మూడు రాజధానులు తదితర అంశాలపై ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేయనున్నామని టీడీపీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పటికిప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు ఖరారు కాని కారణంగా ఎమ్మెల్సీల పర్యటనను వాయిదా వేసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ నెల 19 నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్రలను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలను విజయవంతం చేయాలని చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Telugudesam
MLCs
Delhi Tour
Cancel

More Telugu News