Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కేఎల్ రాహుల్.. పదో స్థానానికి పడిపోయిన విరాట్ కోహ్లీ

  • టీ20 ర్యాంకులు సవరించిన ఐసీసీ
  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో ప్రదర్శనతో రెండో ప్లేస్ నిలుపుకొన్న రాహుల్
  • దేశాల వారీగా పాక్ టాప్.. టీమిండియా నాలుగో స్థానం
KL Rahul Retains Second Spot Kohli Drops To 10 in Icc T20 rankings

ఐసీసీ ప్రకటించిన వరల్డ్ టీ20 బ్యాట్స్ మెన్ ర్యాంకుల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 224 పరుగులు చేయడంతో తన ప్లేస్ ను కాపాడుకున్నాడు. మరోవైపు ఆ సిరీస్ లో ఆడిన నాలుగు మ్యాచ్ లలో కలిపి 105 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ పదో స్థానానికి పడిపోయాడు. టీమిండియా బ్యాట్స్ మెన్లలో వీరిద్దరితోపాటు రోహిత్ శర్మ 9 స్థానంతో టాప్–10 లో ఉన్నాడు. 

టాప్ లో పాక్ బ్యాట్స్ మన్

టీ20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ తర్వాత మూడో ప్లేస్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ నిలిచాడు.
20 బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్.. ఆల్ రౌండర్ల విభాగంలో అదే దేశానికి చెందిన మహమ్మద్ నబి టాప్ లో ఉన్నారు.

టీమిండియా నాలుగో స్థానంలో..

దేశాల వారీగా చూస్తే.. 20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా రెండో ప్లేస్ లో ఉండగా.. ఇంగ్లండ్ కేవలం రెండు పాయింట్ల తేడాతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా నాలుగో స్థానంలో, సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి.

More Telugu News