BJP: ఆ ఉద్దేశం ఉంటే ధైర్యంగా చెప్పండి: వైసీపీని సూటిగా ప్రశ్నించిన సీపీఐ రామకృష్ణ

CPI ramkrishna asks Jagan should open on allience with BJP
  • బీజేపీతో కలవాలనుకుంటే వెల్లడించండి
  • ఈ విషయంలో దోబూచులాటలు ఎందుకు?
  • మోదీ పాలన అంతా అంబానీలు, ఆదానీల కోసమే
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి నడవాలనుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ఇందులో దాగుడుమూతలు ఎందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఢిల్లీ వెళ్లిన సీఎం గంటన్నరపాటు ప్రధాని మోదీతో ఏం మాట్లాడారని, ఏం అడిగారో ఆ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాల్లోకి వదిలేసిందన్నారు. ప్రస్తుతం వారి పని అంబానీలు, ఆదానీలు, బిర్లాల సేవకే సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు నిధుల విషయంలో మోదీ మాట తప్పారని, ఆ విషయంలో ఏం చేశారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
BJP
JAGAN
CPI
k.ramakrishna
allience

More Telugu News