'భీష్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా త్రివిక్రమ్

17-02-2020 Mon 12:40
  • ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  •  ఈ నెల 21వ తేదీన విడుదల
Bheeshma Movie

నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' సినిమాను, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ రోజున నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ - యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను జరపనున్నారు. ఈ వేడుకకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.

ఈ ప్రేమకథాంశంలో కథానాయికగా రష్మిక కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. కథ నడకకి అడ్డు తగులుతుందనే ఉద్దేశంతో ఆ పాటను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. బాగా ఖర్చు పెట్టి తీసిన ఆ పాటను లేపేయడం బాధాకరమే.