ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు
- ఈ నెల 24న భారత పర్యటనకు వస్తున్న ట్రంప్
- అహ్మదాబాద్ లో మోదీ కలిసి ప్రసంగం
- కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం
ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం శరవేగంగా నిర్మాణపనులు జరుపుకుంటోంది. అహ్మదాబాద్ మొతేరాలోని ఈ స్టేడియాన్ని ట్రంప్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ట్రంప్ మూడు గంటల పాటు అహ్మదాబాద్ లో ఉంటారు. అందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు, పాత రోడ్ల ఆధునికీకరణ చేపట్టారు. ట్రంప్ భద్రత కోసమే రూ.15 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ట్రంప్ హాజరయ్యే రోడ్ షో కోసం 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.