Somu Veerraju: ఏపీలో రాజకీయ నాయకులపై ఐటీ లాంటి సంస్థలు నిఘా పెట్టాలి: సోము వీర్రాజు

  • అవినీతి పెరగడం వల్లే ఏపీ అభివృద్ధి ఆగిపోయింది
  • బీజేపీతో వైసీపీ పొత్తు  అభూత కల్పన
  • గత ప్రభుత్వం ‘అమరావతి’ అంటే, ఈ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ అంటోంది
Somu veeraju requests  there is a need to surveillance on AP Politicians

ఏపీలో రాజకీయ నాయకులపై ఐటీ లాంటి సంస్థలు నిఘా పెట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ పై ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్లు దొరికాయని, అవినీతి పెరగడం వల్లే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి’ అంటే, ఈ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ అంటోందని విమర్శించారు.

ఈ సందర్భంగా శాసనమండలి అంశం గురించి ఆయన ప్రస్తావిస్తూ, దీనిపై ప్రజలకు విశ్వాసం లేదని, మండలి రద్దు విషయంలో బీజేపీ ఆలోచిస్తోందని అన్నారు. బీజేపీతో వైసీపీ పొత్తు వదంతులపై ఆయన స్పందిస్తూ , కేవలం ఇది అభూతకల్పన మాత్రమేనని అన్నారు.

More Telugu News