Tollywood: ప్రేమికుల రోజున వారిని హోటల్‌కు తీసుకెళ్లాం.. తిన్నావా? ఏ సినిమా చూశావ్? అని మాట్లాడుకున్నారు: నటి మడోనా

Madonna Sebastian tells her friend love story
  • బడిలో నా క్లాస్‌మేట్ ఓ అమ్మాయిని ప్రేమించాడు
  • వారిద్దరు తమ ప్రేమను బయటకు చెప్పుకోలేదు
  • వారిద్దరిని హోటల్‌కు తీసుకెళ్లాం
  • ప్రేమ గురించి చెప్పకోకుండా సిగ్గుపడ్డారు
ప్రేమికుల రోజు వచ్చిందంటే తనకు ఓ ఘటన గుర్తు కొస్తుందని  ప్రేమమ్‌ సినిమా నటి మడోనా సెబాస్టియన్‌ ఓ ఆసక్తికర కథను చెప్పింది. తాను బడిలో చదువుకుంటున్న రోజుల్లో తన క్లాస్‌లో ఓ విద్యార్థి పక్క తరగతిలో చదువుకుంటున్న అమ్మాయిని ప్రేమించాడని తెలిపింది.

ఇద్దరూ చూసుకునే వారని కాని మాట్లాడుకునే వారు కాదని చెప్పింది. దీంతో మేమంతా ప్రేమికులరోజున కలుసుకుని ప్రేమను వ్యక్తం చేసుకోవాలని వారిద్దరికీ చెప్పి, ఒప్పించామని తెలిపింది. వారిద్దరినీ ఒక హోటల్‌కు తీసుకెళ్లామని, మాట్లాడుకోవాలని చెప్పామని వివరించింది. అయితే, వారు ప్రేమ గురించి చెప్పుకోకుండా తిన్నావా? ఈ మధ్య ఏ సినిమా చూశావు? అనే మాటలు మాట్లాడుతుకున్నారని చెప్పింది.

చివరకు వారిద్దరు తమ ప్రేమను బయటకు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. ప్రతి ఏడాది ప్రేమికుల రోజున తనకు ఈ ఘటనే గుర్తు కొస్తుందని ఓ ఇంటర్వ్యూలో వాలెంటెన్స్‌ డే సందర్భంగా తెలిపింది.
Tollywood
Madonna Sebastian

More Telugu News