Arvind Kejriwal: సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి పిల్లాడు.. మరోసారి అచ్చం కేజ్రీవాల్‌లా తయారై వచ్చి అబ్బుర పర్చిన ఫొటోలు వైరల్

Little Kejriwal enjoying while Senior one taking Oath as CM of Delhi
  • ఏడాది పిల్లాడు ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ 
  • ఆవ్యాన్ తోమర్‌కు ఆప్ ప్రత్యేక ఆహ్వానం
  • అలరించిన తోమర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున అచ్చం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా తయారై వచ్చి అందరినీ ఆకట్టుకున్న ఏడాది పిల్లాడు ఆవ్యాన్ తోమర్‌కు ఆప్ ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆ పిల్లాడిని ఆప్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించింది.
                     
దీంతో అతడు మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కట్టుకునేట్టుగా తలకు మఫ్లర్, మెరూన్ కలర్ స్వెటర్ వేసుకుని, ఆప్ టోపీ, కళ్లద్దాలు పెట్టుకుని, మీసంతో వచ్చి అబ్బురపర్చాడు. మరోసారి అతడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చలికాలంలో కేజ్రీవాల్‌ ఇటువంటి దుస్తులు ధరించి కనపడతారు.              
Arvind Kejriwal
New Delhi
AAP

More Telugu News