క్షమాపణలు చెబితే గాయని చిన్మయిని క్షమిస్తా: రాధారవి

16-02-2020 Sun 08:43
  • గతంలో రాధారవిపై చిన్మయి విమర్శలు
  • తాజాగా డబ్బింగ్ సంఘానికి చైర్మన్ గా ఎన్నికైన రాధారవి
  • తిరిగి చిన్మయిని చేర్చుకునేందుకు అభ్యంతరం లేదని వెల్లడి
Radharavi Comments on Singer Chinmayi

తనపై ఎన్నో ఆరోపణలు చేసిన గాయని చిన్మయి, క్షమాపణలు కోరితే క్షమిస్తానని, తిరిగి డబ్బింగ్ కళాకారుల సంఘంలో చేర్చుకునేందుకూ అభ్యంతరం లేదని సంఘం అధ్యక్షుడు రాధారవి వెల్లడించారు. కోలీవుడ్ డబ్బింగ్ కళాకారుల సంఘం ఎన్నికలు నిన్న చెన్నై, కోయంబేడులోని ఏకేఆర్ కల్యాణమండపంలో జరిగాయి. ఈ పదివికి చిన్మయి కూడా నామినేషన్ వేయగా, దాన్ని తిరస్కరించారన్న సంగతి తెలిసిందే. దీంతో రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల సందర్భంగా రాధారవి మాట్లాడుతూ, చిన్మయి క్షమాపణలు చెబితే తిరిగి ఆహ్వానిస్తానని అన్నారు.