Vizag: విశాఖను కమ్మేసిన పొగమంచు... అన్ని విమానాలూ రద్దు!

Flight Services Canceled form Vizag due to Dence Fog
  • భువనేశ్వర్ కు మళ్లిన ఎయిర్ ఏషియా విమానం
  • ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సర్వీసులు రద్దు
  • ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
విశాఖపట్నాన్ని ఈ ఉదయం పొగమంచు కమ్మేయడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానం ల్యాండింగ్ అయ్యే వీలు లేకపోవడంతో విశాఖలో దిగాల్సిన ఎయిర్ ఏషియా ఫ్లయిట్ ను భువనేశ్వర్ కు మళ్లించారు. విశాఖ నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిన స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల తరువాత సర్వీసులను తిరిగి పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పొగమంచు కారణంగా విమానాలు రద్దు కావడంతో, వాటిని ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వందలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఇబ్బందులు పడుతున్నారు.
Vizag
Airport
Fog
Flights
Cancel

More Telugu News