కాళేశ్వరంలో మహాఘట్టం ఆవిష్కృతం!

16-02-2020 Sun 06:46
  • ఒకేసారి 11 మోటార్లను ఆన్ చేసిన అధికారులు
  • మేడిగడ్డ నుంచి అన్నారంకు గోదారమ్మ పరుగులు
  • ఒక్కరోజులో 2 టీఎంసీల నీటి ఎత్తిపోత
Water Released from Medigadda to Annaram

తెలంగాణను సస్యశ్యామలం చేసేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మహాఘట్టం ఆవిష్కృతమైంది. మేడిగడ్డ బ్యారేజ్ లో తొలిసారిగా పూర్తి స్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోగా, 11 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేశారు. ప్రాజెక్టు నుంచి ఒకేసారి 11 మోటార్లతో నీటిని ఎత్తిపోయడం ఇదే తొలిసారి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు అక్కడి ప్రజలు అమితాసక్తిని చూపారు.

ఇక మేడిగడ్డ నుంచి పరుగులు పెట్టిన గోదారమ్మ, కొన్ని గంటల వ్యవధిలోనే అన్నారం బ్యారేజ్ కి చేరుకుంది. ఇప్పటికే అన్నారంకు 2 టీఎంసీలకు పైగా నీరు చేరిందని అధికారులు వెల్లడించారు. అన్ని మోటార్లనూ ఆన్ చేస్తే, ఒక్క రోజులోనే నాలుగు టీఎంసీల నీటిని తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇంత భారీ మొత్తంలో నీటిని విజయవంతంగా విడుదల చేసిన అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.