ఇటలీలో సందడి చేస్తున్న 'రెడ్'

15-02-2020 Sat 11:52
  • రామ్ .. కిషోర్ తిరుమల నుంచి మరో సినిమా 
  • యూత్ ను ప్రధానంగా చేసుకుని సాగే కథాకథనాలు 
  • ఏప్రిల్ 9వ తేదీన విడుదల
Red Movie

రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో రామ్ సరసన నాయికలుగా నివేద పేతురాజ్ .. మాళవిక శర్మ .. అమృత కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది.

ప్రస్తుతం పాటల చిత్రీకరణను పూర్తిచేసే పనిలో వున్నారు. ఇటలీలో రెండు పాటలను ప్లాన్ చేశారు. అక్కడి వివిధ లొకేషన్స్ లో పాటలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్లో 'నేను శైలజ'.. 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు వచ్చాయి. 'నేను శైలజ' యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. 'రెడ్' సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.