చివరి నిమిషంలో ఖరారైన కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు... ఢిల్లీలోనే జగన్!

15-02-2020 Sat 10:34
  • ఈ ఉదయం అమరావతికి తిరుగు ప్రయాణమైన జగన్
  • రవిశంకర్ ప్రసాద్ పేషీ నుంచి కాల్
  • మధ్యాహ్నం 12 గంటలకు భేటీ
Law Minister Ravishankar Prasad Confirms Appointment for Jagan

నిన్న హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ ఉదయం తిరిగి అమరావతికి బయలుదేరుతున్న వేళ, కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు ఖరారు కావడంతో, ఆయన తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

నిన్న అమిత్ షాను కలిసిన తరువాత, జగన్ రాత్రికి హస్తినలోనే బస చేసిన సంగతి తెలిసిందే. నేడు కొందరు మంత్రులను ఆయన కలవాలని భావించగా, తొలుత ఎవరి అపాయింట్ మెంట్లూ కుదరలేదు. దీంతో ఆయన ఉదయం 9.30 గంటలకు వెనక్కు బయలుదేరారు. ఈలోగానే ఆయనకు న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేషీ నుంచి పిలుపు వచ్చింది.

మధ్యాహ్నం 12 గంటలకు రవిశంకర్ ప్రసాద్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఖరారైంది. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించడంపై వీరిద్దరి మధ్యా ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఆపై నితిన్ గడ్కరీ తదితర మంత్రులను కూడా జగన్ కలుస్తారని తెలుస్తోంది.