'మహాసముద్రం' విషయంలో మనసు మార్చుకున్న సమంత?

15-02-2020 Sat 10:26
  • ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జాను'
  • పరాజయంతో డీలాపడిన సమంత 
  •  హీరోహీరోయిన్లను వెతికేపనిలో అజయ్ భూపతి 
Samantha

సమంత .. శర్వానంద్ జంటగా రూపొందిన 'జాను' .. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. తనకి మరింత మంచి పేరు తీసుకొస్తుందని భావించిన ఈ సినిమా నిరాశపరచడంతో సమంత డీలాపడిపోయినట్టు తెలుస్తోంది.

ఈ ప్రభావమే 'మహాసముద్రం' ప్రాజెక్టుపై పడినట్టు చెప్పుకుంటున్నారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, శర్వానంద్ - సమంత జంటగా 'మహాసముద్రం' ప్లాన్ చేసుకున్నాడు. 'జాను' హిట్ అయితే అజయ్ భూపతి అనుకున్నట్టుగా జరిగేదే. కానీ ఆ సినిమా పరాజయంపాలు కావడంతో, సమంత మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. మళ్లీ అజయ్ భూపతి హీరో హీరోయిన్లను వెతికేపనిలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.