60వ రోజుకు అమరావతి నిరసనలు

15-02-2020 Sat 10:24
  • కొనసాగుతున్న రైతుల దీక్షలు
  • ఈరోజు మందడం, వెలగపూడిలో రైతుల 24 గంటల దీక్ష
  • ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయం
Amravati protests reaches 60th day

రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు 60వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరుల్లో రైతుల ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగిలిన గ్రామాల్లో కూడా రైతులు, మహిళలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈరోజు మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల పాటు దీక్షకు కూర్చున్నారు. తమ ఉద్యమం 60వ రోజుకు చేరినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో... ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని వారు నిర్ణయించారు.