చంద్రబాబులో లేని అవినీతిని వెతకడం కంటే ఈ గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ: నారా లోకేశ్

14-02-2020 Fri 18:27
  • ఐటీ దాడుల అంశంలో వైసీపీ నేతలకు టార్గెట్ గా మారిన చంద్రబాబు
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • బూటకపు రాతలు ఆపి ప్రజల గురించి ఆలోచించాలని హితవు
Nara Lokesh mocks YS Jagan

ఐటీ దాడుల వ్యవహారంలో వైసీపీ నేతలంతా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ గారూ, చంద్రబాబులో లేని అవినీతిని వెతకడం కంటే ఈ గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ అంటూ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ఇకనైనా మీ బూటకపు రాతలు ఆపి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని ట్వీట్ చేశారు. అందులో పైభాగంలో సాక్షి పత్రికలో చంద్రబాబు అవినీతి అంటూ వచ్చిన బ్యానర్ ఐటమ్, కిందిభాగంలో ఓ గుడ్డు వంక తదేకంగా చూస్తున్న సీఎం జగన్ ఫొటో చూడొచ్చు.