రమేశ్ వర్మ సినిమాకి గ్యాప్ తీసుకోని రవితేజ

14-02-2020 Fri 09:37
  • 'క్రాక్' సినిమా షూటింగులో రవితేజ 
  • మే 8వ తేదీన విడుదల 
  • తదుపరి సినిమా దర్శకుడిగా రమేశ్ వర్మ
Raviteja Movie

రవితేజ గతంలో ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తరువాత వరుస పరాజయాలు వెంటాడుతూ రావడం, అనుకున్న ప్రాజెక్టులు చివరి నిమిషాల్లో ఆగిపోవడం వంటి కారణాల వలన ఏడాదికి మూడు సినిమాలు చేయలేకపోయాడు. ఈ ఏడాది మాత్రం మళ్లీ మూడు సినిమాలు అందించే ప్రయత్నాలే చేస్తున్నాడు.

ఇప్పటికే ఆయన నుంచి 'డిస్కోరాజా' వచ్చేసింది. ఇక తదుపరి సినిమాగా ఆయన 'క్రాక్' చేస్తున్నాడు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మే 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత రవితేజ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. వెంటనే రమేశ్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను కూడా విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే రవితేజ మళ్లీ పుంజుకున్నట్టే.