సుష్మస్వరాజ్ జయంతి సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం

14-02-2020 Fri 09:27
  • మోదీ గత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మ
  • గతేడాది ఆగస్టు 6న కన్నుమూత
  • ఆమె గౌరవార్థం రెండు సంస్థలకు ఆమె పేరు
central government renames to Institutes after Sushma Swaraj

బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మ స్వరాజ్ జయంతి నేడు. ఆమె 68వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రం, ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు గురువారం కేంద్రం సుష్మ స్వరాజ్ పేరు పెట్టింది.

ప్రవాస భారతీయ కేంద్రానికి  ‘సుష్మా స్వరాజ్‌ భవన్‌’గా, ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ‘సుష్మా స్వరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ సర్వీస్’గా నామకరణం చేసింది. గతంలో మోదీ ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన సుష్మ గుండెపోటు కారణంగా గతేడాది ఆగస్టు 6న కన్నుమూశారు. సుష్మ గౌరవార్థం ఈ రెండు ఇనిస్టిట్యూట్‌లకు ఆమె పేరు పెట్టినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.