కేజ్రీవాల్ క్రేజ్ మామూలుగా లేదు.. 24 గంటల్లో ఆప్ లో చేరిన 11 లక్షల మంది

13-02-2020 Thu 14:47
  • మిస్స్ డ్ కాల్ ఇవ్వండి.. పార్టీలో చేరండి అని పిలుపునిచ్చిన ఆప్
  • భారీ ఎత్తున ప్రజాస్పందన
  • ఇది తాము సాధించిన మరో ఘనత అని ఆప్ ప్రకటన
More than 1 million people have joined AAP within 24 hours of AAP victory

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రికార్డులు సృష్టిస్తోంది. మిస్స్ డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరండి అంటూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు ఆప్ లో చేరారు. ఈ విషయాన్ని ఆప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. తాము ఘన విజయం సాధించిన 24 గంటల్లోనే మరో ఘనతను సాధించామని ట్వీట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 సీట్లను ఆప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.