మూడో పెళ్లి చేసుకుంటున్న భర్తను పెళ్లి మండపంలోనే చితకబాదిన మొదటి భార్య!

13-02-2020 Thu 13:23
  • బంధువులతో కలిసి వెళ్లి కుమ్మేసింది
  • భార్య, బంధువులపై ఫిర్యాదు చేసిన బాధితుడు
  • పాకిస్థాన్‌లోని కరాచీలో చోటు చేసుకున్న ఘటన
first wife attacks on husband when he is ready for third marriage

తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటే సర్దుకుపోయిన ఆమె, ఇప్పుడు భర్త మూడో పెళ్లికి కూడా సిద్ధం కావడంతో తట్టుకోలేకపోయింది. ఏకంగా పెళ్లి మండపానికే వెళ్లి కాలర్‌ పట్టుకుని నిలదీసింది. బంధువులతో కలిసి భర్తను చితకబాదింది. పాకిస్థాన్‌లోని కరాచీలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. పాకిస్థాన్‌లో 1961లో వచ్చిన ముస్లిం ఫ్యామిలీ లా ఆర్డినెన్స్‌ ప్రకారం భర్త రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే మొదటి భార్య నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి.

కరాచీకి చెందిన సదరు వ్యక్తి భార్యకు తెలియకుండా 2018లోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రహస్యంగా మూడో పెళ్లికి కూడా సిద్ధం కావడంతో ఆమె ఆగ్రహోదగ్రురాలై మండపంలోనే భర్తపై విరుచుకుపడింది. బంధువులతో కలిసి చితకబాదడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను తన మొదటి భార్యతో తెగదెంపులు చేసుకున్నానని, త్వరలో లీగలు నోటీసు పంపిస్తానని చెబుతున్నాడు. దీంతో పోలీసులు తమకెందుకీ తంటా అనుకుని కోర్టులోనే తేల్చుకోమని చెప్పి పంపించేశారు.