Narendra Modi: 130 కోట్ల మందిలో కోటిన్నర మందే ట్యాక్స్ కడుతున్నారు.. నిజాయతీగా ట్యాక్స్ కట్టాలి: మోదీ

PM said people should pay their taxes honestly
  • ట్యాక్స్ లను గౌరవించే దేశంగా ఇండియాను మారుద్దాం
  • నాలుగైదేళ్లుగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది
  • పెద్ద టార్గెట్ పెట్టుకుని సాధించేందుకు ప్రయత్నించడం మంచిదని వెల్లడి
దేశంలో 130 కోట్ల మందికిపైగా జనాభా ఉంటే అందులో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపు పన్ను కడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలంతా నిజాయతీగా పన్నులు కడతామని వాగ్దానం చేయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్ నవ్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు.

‘‘2022లో మనం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకుందాం. ఇండియాను సరిగ్గా పన్నులు కట్టే, గౌరవించే దేశం (ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఆ దిశగా చాలా వర్క్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది’’ అని మోదీ చెప్పారు.

వేధింపులు లేకుండా చేశాం

ట్యాక్స్ కట్టే వాళ్లకు అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేశామని మోదీ అన్నారు. పీపుల్స్ సెంట్రిక్ (ప్రజలే కేంద్రం)గా ఉండేలా విధానాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ట్యాక్స్ లకు సంబంధించి డిపార్ట్ మెంట్లను పునర్వ్యవస్థీకరించామని, అవినీతికి చోటు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ పై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ‘‘ఎలాంటి లక్ష్యం పెట్టుకోకుండా వెనుకబడటం కంటే.. పెద్ద టార్గెట్ ను పెట్టుకుని, దాన్ని సాధించేందుకు కష్టపడటం మంచిది..’’ అని చెప్పారు.
Narendra Modi
Income Tax
tax payments
pay tax honestly

More Telugu News