Pawan Kalyan: అందుకే సరైన నాయకులను ఎన్నుకోవాలి: జనసేన అధినేత పవన్ కల్యాణ్

elect good leader says pawan kalyan
  • చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోతే ఏం లాభం? 
  • బాధ్యతగా ఉండే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోకపోతే ఇబ్బందులు వస్తాయి
  • కొత్త వారిని, బాధ్యతగల వారిని ఎన్నుకోకపోతే ఎలా? 
  • ఆలోచించి పని చేసే వారికి ఓటేయాలి 
ప్రజల సమస్యలు తీర్చే సరైన నాయకులకు ఎన్నికల్లో ఓటేసి ఎన్నుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లాలో ఆయన రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలకు పలు సూచనలు చేశారు.

'చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోతే ఏం లాభం? బాధ్యతగా ఉండే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కొత్త వారిని, బాధ్యతగల వారిని ఎన్నుకోకపోతే ఎలా? పనిచేయని వారి గురించి ప్రజలు ఆలోచించాలి' అని వ్యాఖ్యానించారు.

'ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు బాగా ఆలోచించాలి. కర్నూలులోనే కాదు అన్ని జిల్లాల ప్రజలు ఆలోచించాలి. డబ్బులు పడేశాం కాబట్టి ప్రజలు ఓటేశారని, ఇక వారి కోసం పని చేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు భావిస్తారు. కనుక ఆలోచించి పని చేసే వారికి ఓటేయాలి. ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే సమస్యలు తలెత్తుతాయి. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే చాలా బాధేస్తోంది' అని చెప్పారు.
Pawan Kalyan
Janasena
Kurnool District

More Telugu News