పీకల్లోతు ప్రేమలో 'ఆర్ఎక్స్ 100' భామ

13-02-2020 Thu 11:14
  • ముంబై మోడల్ ప్రేమలో పాయల్ రాజ్ పుత్
  • ప్రియుడి పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేమ కథను వెల్లడించిన పాయల్
  • నీతో గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే అంటూ ట్వీట్
RX 100 heroine Payal Rajput reveals about her love

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఉత్తరాది భామ పాయల్ రాజ్ పుత్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కొన్న నెలల క్రితమే పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతని గురించి అప్పుడు ఎలాంటి వివరాలను వెల్లడించకపోయినా... అతను ఆమె బోయ్ ఫ్రెండ్ అయివుంటాడనే అందరూ భావించారు. ఇప్పుడు అతనితో గడిపిన మరికొన్ని ఫొటోలను షేర్ చేస్తూ... అతనే తన ప్రాణం అని పాయల్ తమ ప్రేమకథను అభిమానులతో పంచుకుంది. పాయల్ ప్రియడి పేరు సౌరభ్ డింగ్రా. అతను ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా అతనితో పాయల్ డేటింగ్ చేస్తోంది.

ఈ రోజు సౌరభ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో అతనితో గడిపిన మరికొన్ని ఫొటోలను పాయల్ షేర్ చేసింది. 'నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో మరెవరూ లేరు. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే' అని ట్వీట్ చేసింది.