Crime News: బంగారం ‘సుత్తి’... దుబాయ్‌ నుంచి అక్రమ రవాణాకు ఇదో మార్గం!

Gold seized at Shamshabad airport
  • 931 గ్రాము బంగారం రవాణాకు ప్లాన్‌
  • గుట్టుబట్టబయలు చేసిన నిఘా అధికారులు
  • ముగ్గురి అరెస్టు
‘తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు’ అన్న సామెతలా బంగారం అక్రమ రవాణాలో కొందరు ప్రయాణికులు అనుసరిస్తున్న మార్గాలు చూసి అధికారులే నోరు వెళ్లబెడుతున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో ఒకరు ఇనుప సుత్తిలో దాదాపు కేజీ బంగారాన్ని రవాణా చేస్తూ చిక్కడంతో ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే...దుబాయ్‌ నుంచి ముగ్గురు ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు వారిని తనిఖీ చేశారు. అందులో ఒకరి ప్రవర్తన తేడాగా ఉండడం, పైగా అంత ప్రాధాన్యం లేని ఇనుప సుత్తిని దుబాయ్‌ నుంచి తీసుకువస్తుండడంతో అనుమానించారు. దానిని క్షుణ్ణంగా పరిశీలించడంతో సుత్తిలో బంగారం దాచినట్టు బయటపడింది. లోగుట్టు విప్పగా మొత్తం 931 గ్రాముల బంగారం దొరికింది. దీంతో వీరు ముగ్గురినీ అధికారులు అరెస్టుచేసి ప్రశ్నిస్తున్నారు.
Crime News
Hyderabad
samshabad airport
gold seized

More Telugu News