నేను, నా భర్త ట్రంప్ చాలా ఆసక్తిగా ఉన్నాం: మెలానియా ట్రంప్

13-02-2020 Thu 10:15
  • ఈ నెల 24న ఇండియాకు విచ్చేస్తున్న ట్రంప్
  • మోదీ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపిన మెలానియా
  • ఇరు దేశాల మధ్య బంధాలను సెలబ్రేట్ చేసుకుందామంటూ ట్వీట్
POTUS And I Are Excited says Melania Trump

భారత్ పర్యటన పట్ల తాను, తన భర్త చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ అన్నారు. ట్విట్టర్ ద్వారా మెలానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'మోదీగారు మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ఢిల్లీ, అహ్మదాబాద్ పర్యటనల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అమెరికా, భారత్ ల మధ్య ఉన్న బలమైన బంధాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాం' అని ట్వీట్ చేశారు. రెండు రోజుల పర్యటనకు గాను ఈ నెల 24న ట్రంప్ ఇండియాకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.