Vijayasai Reddy: ఏపీ నాశనమైపోవాలని కిరసనాయిలు కోరుకుంటున్నాడు: మీడియా అధినేతపై విజయసాయిరెడ్డి ఫైర్

Vijayasai Reddy blames ABN Radha Krishna
  • జగన్ ను మోదీ మందలించారంటూ సైనైడ్ వార్తలను కుమ్మరించారు
  • చంద్రన్న భజన పరాకాష్ఠకు చేరింది
  • ఓ మీడియా అధినేతపై విజయసాయి ధ్వజం
ఓ తెలుగు మీడియా అధినేతపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా లేని ఏపీ నాశనమైపోవాలని కిరసనాయిలు కోరుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూ ముఖ్యమంత్రి జగన్ గంటన్నర సేపు సమావేశమయ్యారని.... అయితే, పీపీఏలపై జగన్ ను మోదీ మందలించారంటూ సైనైడ్ వార్తలను కుమ్మరించారని మండిపడ్డారు. జయము జయము చంద్రన్నా అనే భజన పరాకాష్ఠకు చేరిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP
Jagan

More Telugu News